- రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
Celebrities who have wished for the New Year: రాష్ట్ర ప్రజలకు.. గవర్నర్, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం చేదు జ్ఞాపకాల్ని వదిలేసి... నూతన లక్ష్యాలు, ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని సూచించారు.
- వైసీపీలో అంతర్యుద్దం.. విధ్వంసాల సంవత్సరంగా 2022 : చంద్రబాబు
CHANDRABABU FIRES ON CM JAGAN : రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని.. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని ఆక్షేపించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయన్నారు. అధికార పార్టీలోనూ అంతర్యుద్దం మొదలైందని బాబు పేర్కొన్నారు.
- పవన్ సేవా కార్యక్రమాలు, పర్యటనలు చూసి వైసీపీ టార్గెట్ చేసింది: పోతిన మహేశ్
All state politics revolves around Pawan kalyan: 2022 సంవత్సరం పవన్ కల్యాణ్ నామ సంవత్సరంగా సాగిందని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. ఈ ఏడాది మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ చుట్టూనే తిరిగాయన్నారు. పవన్ సేవా కార్యక్రమాలు, పర్యటనలు చూసి... సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ టార్గెట్ చేశారన్నారు.
- పైసాకు బిర్యానీ ఆలోచన.. ఆ హోటల్‌కు పబ్లిసిటీ తెచ్చింది..!
Biryani for 5 paise: పైసా లేదా అయిదు పైసలనాణేనికి.... ఒక బిర్యాని అని నంద్యాలలో ఓ హోటల్ ప్రకటనతో ప్రజలు బారులు తీరారు. నాణేలతో బిర్యాని కోసం నగరవాసులు ఎగబడ్డారు. క్లాసిక్ జైలు హోటల్ నిర్వాహకులు ఇలా వినూత్నంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేశారు. నగరవాసుల నుంచి వచ్చిన స్పందన చూసి హోటల్ యజమానురాలు సంధ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు
- నిర్మాణంలోని భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలు.. శిథిలాల కింద 12మంది!
నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలిపోయింది. దాదాపు దాదాపు 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పంజాబ్‌లో ఈ ఘటన జరిగింది.
- కొత్తగా కరోనా వ్యాప్తి.. దేశంలో తొలి 'సూపర్ వేరియంట్' కేసు.. డేంజరేనా?
అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్ ఉపరకం ఎక్స్‌బీబీ.1.5 తొలి కేసు భారత్‌లోనూ నమోదైంది. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం దీనికి ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూఇయర్ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2022కు వీడ్కోలు పలికిన అక్కడి ప్రజలు 2023కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచా, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ఆయా నగరాలు జిగేల్మంటున్నాయి.
- కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి. భవిష్యత్ అవసరాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. 2023లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం.
- అమిత్ షాను కలిసిన హార్దిక్ పాండ్య.. కారణం ఏంటో?
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేశారు.
- నయా జోష్.. డబుల్ ఫన్.. 2023లో క్రేజీ మూవీస్!
నిన్నటి వరకు 2022.. నేటి నుంచి 2023. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. కొత్త కలలను నిజం చేసేందుకు ముందుకు వస్తున్నాము. అలా మనకు కొత్త సినిమాల చూపించాలని సిసీ తారలు సైతం రెట్టింపు ఉత్సాహంతో కొత్త సినిమా షెడ్యూల్లతో బిజీ అయిపోయారు. ఓ సారి ఆ అప్డేట్స్ చూసేద్దమా..