ap corona cases today: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదేసమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి నిన్న 10,290 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 9 మంది మరణించినట్లు తెలిపారు.
దేశంలో..
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 4,03,71,500
- మొత్తం మరణాలు: 4,91,700
- యాక్టివ్ కేసులు: 22,02,472
- మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,22,726 మందికి కరోనా సోకింది. 10,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,29,39,500కి చేరగా.. మరణాల సంఖ్య 56,45,188కు పెరిగింది.
ఇదీ చదవండి: Omicron Variant: ఒమిక్రాన్‌లో వేధిస్తున్న ప్రధాన సమస్యలివే..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!