తితిదే సప్తగిరి మాసపత్రిక వివాదంపై గుంటూరులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పత్రిక చందాదారుడు విష్ణు ఇంటికి వెళ్లిన తిరుపతి పోలీసులు... ఘటనపై వివరాలు సేకరించారు. అన్యమత పుస్తకం వచ్చిన రోజే ఆ విషయంపై తితిదే విజిలెన్స్ విభాగానికి విష్ణు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రాథమిక విచారణ జరిపిన తితిదే... వేరే ఎక్కడా ఇలా జరగలేదని ప్రకటించింది. ఒక్క చందాదారుడి విషయంలో అన్యమత పుస్తకం రావడంపై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు తిరుపతి పోలీసులు విచారణ చేస్తున్నారు.
పూర్తి విచారణ తర్వాత చర్యలు: తిరుపతి సీఐ వీరేశ్
అయితే.. బుక్ పోస్టులో పుస్తకం వస్తే కవర్ అంటించి ఉండదని తిరుపతి ఎస్‌ఐ వీరేశ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోస్ట్‌మేన్‌నూ ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ జరిగింది..
గుంటూరు నగరంలోని మల్లిఖార్జునపేటకు చెందిన రాఘవరావు.. సప్తగిరి మాసపత్రిక చందాదారుడు. జులై నెలకు సంబంధించిన పత్రిక సోమవారం ఉదయం వచ్చింది. అతని ఇంటి గేటు వద్ద పోస్టుమేన్ దానిని పెట్టి వెళ్లారు. కవరు తెరచి చూడగా సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమతానికి చెందిన సజీవ సువార్త అనే మరో బుక్ లెట్ వచ్చిందని రాఘవరావు బంధువు విష్ణు గమనించారు. ఆ విషయాన్ని పోలీసులకు వివరించారు.
తాము పవిత్రంగా పూజించే వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల నుంచి ఇలాంటి పుస్తకం రావటంపై రాఘవరావు కుటుంబం, బంధువులు ఆశ్చర్యానికి గురైనట్టు చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాఘవరావు కుటుంబీకులు కోరారు.
ఇదీ చూడండి: