ETV Bharat / state

'వామ్మో టిడ్కో ఇళ్లా? మాకొద్దు' - సీఆర్​డీఏ నోటీసులతో ఉలిక్కిపడుతున్న లబ్ధిదారులు - టిడ్కో ఇళ్ల ఇబ్బందులు

TIDCO Houses Problems In Guntur District : టిడ్కో ఇళ్ల లబ్దిదారులు ఆ ఇళ్లే వారి గల్లపెట్టెకు చిల్లు అంటున్నారు. ఇళ్లు అచ్చినట్టే ఇచ్చిన వైసీపీ ప్రభుత్వ వడ్డీలని వారి పీకల మీద కూర్చున్నంత పని చేస్తుందంటున్నారు పేద ప్రజలు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ఈ ఇళ్లు వద్దు బాబోయ్​ అంటున్నారు ప్రజలు.

tidco_houses_problems_in_guntur_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 4:37 PM IST

'వామ్మో టిడ్కో ఇళ్లా? మాకొద్దు' - సీఆర్​డీఏ నోటీసులతో ఉలిక్కిపడుతున్న లబ్ధిదారులు

TIDCO Houses Problems In Guntur District : తాను పేదల పక్షపాతినని, పెత్తందారులపై యుద్ధం చేస్తున్నానని సీఎం జగన్‌ ప్రతి సభలోనూ చెబుతుంటారు. కానీ ఆయన టిడ్కో ఇళ్ల పేరిట పేదలపై యుద్ధం చేసి వారి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పట్ల ప్రభుత్వ తీరే ఇందుకు నిదర్శనం. వడ్డీ పేరుతో ఒక్కొక్కరు 50 వేల రూపాయలు చెల్లించాలని బ్యాంకులు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశాయి. వడ్డీలు కట్టి అరకొర సౌకర్యాలతో ఉండే ఈ టిడ్కో ఇళ్ల కంటే అద్దె ఇళ్లల్లో ఉండటమే నయమని లబ్ధిదారులు చెబుతున్నారు.

టిడ్కో ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు: జేసీ ప్రభాకర్​ రెడ్డి

TIDCO House Holders Fore On YCP Government : టిడ్కో ఇళ్ల పేరుతో జగన్‌ సర్కార్‌ లబ్ధిదారులపై రోజుకో గుదిబండ మోపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో సుమారు 750 టిడ్కో ఇళ్లు నిర్మించి 2018లో లబ్ధిదారులకు మంజారు చేశారు. 2021 నవంబరులో బ్యాంకు నుంచి రుణం మంజూరు కాగానే ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేయడంతో ఈ ఏడాది ఆగస్టులో లబ్ధిదారులు ఇళ్లల్లోకి వచ్చారు. తాజాగా వీరు ఉంటున్న ఇంటికి 2021 నవంబరు నుంచి వడ్డీలు చెల్లించాలంటూ సీఆర్​డీఏ (Capital Region Development Authority & Capital Area) బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. ఈఎమ్​ఐ (equated monthly instalment) లో అదనంగా వెయ్యి రూపాయలు కలిపి రెండేళ్లుగా చెల్లించాల్సిన వడ్డీ వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

టిడ్కో గృహ నిర్మాణాల రుణాలు.. చెల్లించాలని లబ్దిదారులకు బ్యాంకర్ల నోటీసులు

TIDCO Houses Issue In AP : పేదలకు నివాసం కల్పించామని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమైంది. తాగునీరు కూడా సక్రమంగా రావట్లేదని వేరే చోటుకి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతుందంటున్నారు.

వడ్డీ పేరుతో గుదిబండ మోపేటట్లయితే సరైన సౌకర్యాలు లేని టిడ్కో ఇళ్లు తమకు వద్దని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడ్కో ఇళ్లు బ్యాంకులకు తనఖా పెట్టొద్దు - లబ్ధిదారులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధర్నా

'టిడ్కో లబ్ధిదారుల ఇంటి అద్దెలు, బ్యాంకు బకాయిలు' - పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే భిక్షాటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.