ETV Bharat / state

టిడ్కో ఇళ్లు మంజూరు... లబ్ధిదారుల ఆచూకీ కరవు

author img

By

Published : Jan 18, 2021, 5:00 PM IST

గత ప్రభుత్వ హయంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో చాలా మంది ఆచూకీ తెలియటం లేదని మున్సిపల్‌ వర్గాలు తెలిపాయి . ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 2వేల మంది లబ్ధిదారుల సమాచారం లేదని ప్రాథమికంగా గుర్తించారు. వీరికి మంజూరైన ఇళ్లను తిరిగి ఎవరికి కేటాయించాలి? అందుకు ఏం నిబంధనలు పాటించాలో మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ టిడ్కో ఉన్నతాధికారులకు లేఖలు రాసే యోచనలో మున్సిపల్‌ వర్గాలు తెలిపాయి.

tidco house sanctioned but beneficiaries  are missing

త ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో మధ్య తరగతి వర్గాల వారికి నిర్మించిన టిడ్కో ఇళ్లను తీసుకోవడానికి దరఖాస్తులు చేసుకున్న వారిలో పలువురు లబ్ధిదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. వీరి ఆచూకీ కోసం గతంలో ఇచ్చిన చిరునామాలకు వెళ్లి చూస్తే కొందరు జిల్లా యేతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మరికొందరు అసలు ఎక్కడ ఉంటున్నారో కూడా వారికి సంబంధించిన సమాచారం తెలియకుండా ఉంది. వారి చరవాణి నంబర్లను సంప్రదిస్తుంటే అవి మనుగడలో లేవని వస్తున్నాయి. వీరికి కేటాయించిన ఇళ్లను ప్రస్తుతం ఏం చేయమంటారో స్పష్టత కోరుతూ టిడ్కో ఉన్నతాధికారులకు లేఖలు రాసే యోచనలో మున్సిపల్‌ వర్గాలు ఉన్నాయి. ఒక్క గుంటూరు నగరపాలికలోనే అత్యధికంగా ఇప్పటి వరకు 750 ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారం తమ వద్ద లేదని వారి తెలిపారు. ఇలాంటి కేసులు జిల్లాలోని మిగిలిన పురపాలికల్లో సైతం ఉన్నాయని మున్సిపల్‌ ఆర్డీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

నవరత్నాల్లో భాగంగా ఈ నెల 20 కల్లా సెంటు స్థలానికి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లకు గతంలో డీడీలు చెల్లించిన వారికి ఆ ఇళ్లపై సర్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా టిడ్కో ఇళ్లు అనేవి లబ్ధిదారుల ఆర్థిక భాగస్వామ్యంతో నిర్మించి ఇస్తున్నారు. 300, 360, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో ఇప్పటికే జిల్లాలో 9 పురపాలికల్లో నిర్మించారు. గతంలో వారి నుంచి 300 అడుగుల ఇంటికి అయితే రూ.500, 360 అడుగులకు రూ.50వేలు, 430 అడుగులకు రూ.లక్ష చొప్పున డీడీలు కట్టించుకున్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం 300 చదరపు అడుగుల ఇంటికి ఎలాంటి రుసుములు తీసుకోరాదని, ఉచితంగానే కేటాయించాలని నిర్ణయించింది. మిగిలిన 360 అడుగుల ఇంటికి రూ.3.5లక్షలు, 430 అడుగుల ఇంటికి రూ.3.65 లక్షల బ్యాంకు రుణం ఇప్పించి ఆ మొత్తాన్ని నెలవారీ బ్యాంకులకు సులభ వాయిదాల్లో చెల్లించుకునేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించి తొలుత అర్హులకు హక్కు పత్రాలు మంజూరు చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు వాటిని పంపిణీ చేశారు. మిగిలినవి ఈనెల 20వ తేదీ లోపు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ హక్కు పత్రాలు పట్టుకుని వారి చిరునామాలకు వెళ్తుంటే అప్పట్లో ఇచ్చిన చిరునామాల్లో ఉండడం లేదని గుర్తించారు. వారి ఫోన్‌ నంబర్లకు సంప్రదిస్తే కొందరు తాము ప్రస్తుతం రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర చోట్ల ఉంటున్నామని చెబుతున్నారు. గుంటూరు తిరిగి వచ్చే ఆలోచన లేదని, తమకు కేటాయించిన ఇంటిని రద్దు చేసుకుంటామని చెబుతున్నారని నగరపాలక వర్గాలు తెలిపాయి.

2 వేల మంది ఆచూకీ తెలియడంలేదు

జిల్లాలోని గుంటూరు నగరపాలిక సహా మిగిలిన 9 పురపాలికల్లో కలిపి 2వేల మంది లబ్ధిదారుల ఆచూకీ తెలియడం లేదని ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 20వ తేదీలోపు ఇంకెంతమంది ఈ జాబితాలోకి వస్తారో వేచి చూస్తామని, ఆ తర్వాత టిడ్కో ఉన్నతాధికారులకు లేఖలు రాసి వీరికి మంజూరైన ఇళ్లను తిరిగి ఎవరికి కేటాయించాలి? అందుకు ఏం నిబంధనలు పాటించాలో మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరతామని నగరపాలిక అధికారులతో పాటు మున్సిపల్‌ ఆర్డీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టిడ్కో ఇళ్లకు అర్హులైన వారికి ఆ ఇళ్లపై సర్వహక్కులు కల్పిస్తూ మంజూరు పత్రాలు మాత్రమే అందజేశారు. వాటిల్లో నివాసాలు ఉండడానికి వీలుగా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఈ కారణంగా టిడ్కో ఇళ్లు ఇంకా వినియోగంలోకి రాలేదు. మరికొందరేమో ఆయా పురపాలికల్లో అందుబాటులోనే ఉన్నా తమకు టిడ్కో ఇళ్లు వద్దని, తాము వాటి కోసం గతంలో తీసిన డిమాండ్‌ డ్రాఫ్టులను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు బలవంతంగా ఇళ్లు కేటాయించవద్దని, ఎవరికైనా ప్రస్తుతం వాటిని తీసుకోవటానికి ఇష్టం లేకపోతే వారి నుంచి ఓ లేఖ తీసుకుని చెల్లించిన మొత్తాలను వెనక్కు ఇచ్చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో లేని వారి ఇళ్లను ఏం చేయాలో స్పష్టతను ఇవ్వాల్సిందిగా లేఖ రాసి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాటి కేటాయింపులు చేస్తామని నగరపాలిక వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల పథకం.. 24 రోజుల్లో ఇంటి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.