గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఈత కల్లు తాగి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పేటేరు గ్రామానికి చెందిన ఏ.రాజు(35), అల్లంసెట్టి శివయ్య(45), శొంఠి శివ నాగేశ్వరరావు(49) ఈత కల్లు కొని తాగారు. తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన బంధువులు ఇద్దరిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరొకరిని పోలీసులే ఆసుపత్రికి తీసుకొచ్చారు.
బాధితులకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. ప్రాణాపాయం లేదన్నారు. అనంతరం వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి