Job cheating: హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఆర్డర్ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను.. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. జిల్లాకు చెందిన మార్కండేయులు.. కుటుంబ అవసరాలకు మహమ్మద్ జానీ అనే వ్యక్తి వద్ద రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని జానీ డిమాండ్ చేయడంతో..హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన మార్కండేయులు.. అందుకోసం నకిలీ ఆర్డర్ పత్రాలు సృష్టించాడు. దీన్నీ తీసుకొని కోర్టుకు వెళ్లిన జానీకి అసలు విషయం తెలవడంతో.. పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
Letter to Vijayasaireddy: 'ఆ బాధ్యతలు వల్లభనేని వంశీకి వద్దు'