ETV Bharat / state

ఉద్యోగం రాకపోవడంతో.. ఆ విధంగా డబ్బు సంపాదించాలని...! - గుంటూరు జిల్లా

ఉద్యోగం రాకపోవడంతో డబ్బు సంపాదించేందుకు ఓ వ్యక్తి అడ్డదారిపట్టాడు. పోలీసు అవతారం ఎత్తి నకిలీ తుపాకి చూపిస్తూ అందరినీ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి దగ్గర రూ. 500 లాక్కున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

stole
దొంగతనం
author img

By

Published : Sep 23, 2021, 4:49 PM IST

గుంటూరులో బొమ్మ తుపాకీతో అమాయకులను బెదిరిస్తూ.. దొరికినకాడికి నగదు దోచుకువెళుతున్న నకిలీ పోలీస్​ను అరండల్​​ పేట పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి వద్ద నుంచి బొమ్మ తుపాకీ, ద్విచక్ర వాహనం, రూ.100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అరండల్ పేట సీఐ నరేష్​ కుమార్ తెలిపారు.

గుంటూరు నగరాలు ప్రాంతానికి చెందిన తులసీరామ్​.. బజాజ్​ షోరంలో కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్​లో పనినిమిత్తం వెళ్లి ఈ నెల 22 తేదీన రైళ్లులో గుంటూరుకి తిరిగి వచ్చాడు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చి నగరాలు వెళ్లడానికి శంకర్ విలాస్ కూడలి వద్ద ఆటో కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో నిందితుడు బాణావత్ శివ కృష్ణ నాయక్ బైక్‌ పై వచ్చి తాను పోలీస్ అని.." నీ మీద అనుమానం ఉంది నిన్న చెక్ చేయాలి" అంటూ ఒక గన్ చూపించి బెదిరించాడు. అతని వద్ద ఏమి లేకపోవడంతో.. జేబులో నుంచి రూ.500 లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై అరండల్ పేట పోలీస్​స్టేషన్​లో​ బాధితుడు తులసీరామ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బ్రాడీపేటలో అరెస్ట్ చేశారు. నిందితుడు శివ కృష్ణ నాయక్ గతంలో పోలీస్ ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేశారని .. ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ అని చెప్పుకుంటూ అమాయకుల వద్ద నగదు వసులు చేస్తున్నాడని సీఐ వివరించారు.

ఇదీ చదవండి: MISSING : బాలికలు అదృశ్యం... మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.