కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతానికి వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కొవిడ్ టీకాల ప్రక్రియ కొనసాగుతుండగా... ఈ నెల 8 నుంచి మూడో దశ వ్యాక్సినేన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు. గుంటూరు జిల్లాలో 78 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ యాస్మిన్ తెలిపారు. జిల్లాలో మరో 55 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250 చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో యాస్మిన్ సూచించారు.
ఇదీ చదవండి