గుంటూరు జిల్లా రేపల్లెలో ఒకేరోజు రెండు దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. తాలూకా సెంటర్ సమీపంలోనీ వస్త్ర, స్వీట్ మరియు కూల్ డ్రింక్స్ దుకాణాల షట్టర్ తాళాలను ఇనుప చువ్వతో తెరిచి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఒక దుకాణంలో ఉన్న సుమారు 1 లక్ష 90 వేల నగదు, మరో దుకాణంలో 50 వేలు నగదు అపహరించారని బాధితులు తెలిపారు. ఉదయం షాపు తెరిచిన యజమానులు.. చోరీ సంగతి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు రేపల్లె పట్టణ ఎస్సై చాణక్య తెలిపారు. క్లూస్ టీం ద్వారా మిగతా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...