ETV Bharat / state

cc video: అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో చోరీ.. విలువైన ఆభరణాలు మాయం

గుంటూరు జిల్లాలోని అతి పురాతనమైన అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కనకదుర్గ అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఆలయంలోని ప్రవేశించిన దుండగుడు.. అమ్మవారి అభరణాలు ఎత్తుకెళ్లాడు. వాటిని తీసుకెళ్తున్న క్రమంలో కొన్ని అభరణాలు గుడి ఆవరణలో పడిపోయాయి. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన నిందితుడి కదలికల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

theft in temple at tenali
theft in temple at tenali
author img

By

Published : Jun 30, 2021, 12:26 PM IST

అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో చోరీ

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ప్రసన్నకుమార్‌, ఆలయ అధికారులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని శివాలయంలో అంతర ఆలయంగా అమ్మవారి గుడి ఉంది. దీని వెనుక తోటల వైపు నుంచి ఉన్న రెండో తలుపు ద్వారా గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి వచ్చాడు. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మకర తోరణం, శఠగోపాలతో సహా సర్వాభరాణాలను మూట కట్టుకున్నాడు. తిరిగొచ్చిన దారిలోనే పరారయ్యాడు.

చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలు ఆలయంలో ఉన్న నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇతనికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని, కుంటుతూ నడుస్తున్నాడని పోలీసులు చెప్పారు. తెల్లవారుజామున గం.1.30కు ఆలయంలోకి వచ్చిన ఈయన గం.3.30 వరకు అక్కడే ఉన్నాడు. ఆభరణాలు తీసుకువెళుతున్న క్రమంలో త్రిశూలం, చెయ్యి వంటి ఆరు రకాల ఆభరాణాలు గుడి ఆవరణలో, తోటలో పడిపోగా పోలీసులు, ఆలయ అధికారులు వాటిని గుర్తించి తీసుకువచ్చారు.

ఇవి కాకుండా.. మరో 25 రకాల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని, వాటి విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని ఆలయ ఈవో తమ్మా శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆభరణాలన్నీ దాతలు ఇచ్చినవేనని ఆయన చెప్పారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని సీసీఎస్‌, గుంటూరు సీఐ వెంకన్నచౌదరి, క్లూస్‌ బృందం పరిశీలించి, ఆధారాలు సేకరించారు.

ఇదీ చదవండి:

ప్రేమ వేధింపులు: ఆత్మహత్యకు యత్నించిన బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.