గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఎన్ఆర్టీ సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో రూ. 35,000 డ్రా చేసి వస్తున్న ఓ విశ్రాంత హెడ్మాస్టర్ను.. దుండగులు ఏమార్చి నగదు దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్నం గ్రామానికి చెందిన శారద ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం తోట ఆంజనేయులు బుధవారం ఎస్బీఐ బ్యాంకులో నగదు డ్రా చేశాడు.
సైకిల్ మీద పెట్టుకొని ఎన్ఆర్టీ సెంటర్లో మున్సిపల్ కార్యాలయం మలుపు తిరుగుతున్నాడు. ఇది గమనించిన దుండగులు ఆంజనేయులు వద్దకు వచ్చి మీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పడంతో అతను సైకిలు పక్కనపెట్టి ఆ డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. ఈలోగా మరో వ్యక్తి సైకిల్ మీద వెనుక స్టాండ్‌పై ఉంచిన నగదు తీసుకొని ద్విచక్రవాహనంపై ఉడాయించారు.
ఇదీ చదవండి: