గుంటూరు జిల్లా మేడికొండూరులో నీటి కుంటలో పడి యువకుడు మృతిచెందాడు. గుంటూరు గాంధీనగర్ బొమ్మల బజారుకు చెందిన మిట్ట యశ్వంత్, కోటీశ్వరరావు ఇద్దరు మిత్రులు... సరదాగా ఈత కొట్టేందుకు మేడికొండూరు వెళ్లారు. పేరేచర్లలో కెలాసాగిరి కొండ వద్ద ఉన్న క్వారీ గుంతలో దిగారు.యశ్వంత్ నీట మునిగాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఈ విషయాన్ని.. కోటేశ్వరరావు అతని కుటుంబ సభ్యలుకు తెలిపాడు. వారు జరిగిన విషయాన్ని మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు
గత ఈత గాళ్ల సాయంతో నీటి కుంటను గురువారం జల్లెడ పట్టారు. నీట మునిగిన యశ్వంత్(15) మట్టిలో కూరుకు పోయి ఉన్నాడు. మృతి చెంది నట్లు గుర్తించారు. యశ్వంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులు అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలే :హైకోర్టు