ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు - supreme court news telugu

Mlas Poaching case: 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చెేసింది. సిట్​ విచారణను నిలిపివేయాలని నిందితులు దాఖాలు చేసిన పిటిషన్​పై.. సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిట్​ విచారణ స్వేచ్ఛగా జరిగేలా చూడాలని సూచించింది.

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Nov 21, 2022, 4:21 PM IST

Mlas Poaching case: 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ, సిట్‌ విచారణ నిలిపేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్‌ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.