లాక్ డౌన్ మొదలు పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. తెనాలికి చెందిన యువ స్వర్ణకారుడు ఆకురాతి రవితేజ (20) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన రవితేజ రోజులాగే దుకాణానికి వెళ్ళాడు. ఇంటి నుంచి తీసుకెళ్లిన చీరతో దుకాణంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తెనాలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: