ETV Bharat / state

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతి తప్పనిసరి

author img

By

Published : Oct 30, 2022, 11:59 AM IST

NO PERMISSION TO CBI IN TS : తెలంగాణలో సీబీఐ దర్యాప్తునుకు అనుమతి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.

NO PERMISSION TO CBI IN TS
NO PERMISSION TO CBI IN TS

NO PERMISSION TO CBI IN TS : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.

ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్న భాజపా పిటిషన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతి వెనక్కి తీసుకున్నట్లు అదనపు ఏజీ నిన్న హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.