గుంటూరు జిల్లాలోని పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.68 లక్షల క్యూసెక్కులు కాగా....అవుట్ ఫ్లో 3.53 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 14 గేట్లు 3 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 15 వేల క్యూసెక్కులు విద్యుత్ ఉత్పాదన కోసం వదులుతున్నారు.
పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... జలాశయం ప్రస్తుత నీటిమట్టం 174.30 అడుగులగా ఉంది. ఆనకట్ట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా.... ప్రస్తుత నీటి నిల్వ 44.69 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి: