దుబాయ్ అందాలను సినిమాల్లో, టీవీల్లో చూసిన ముగ్గురు పిల్లలు అక్కడికి వెళ్లాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇంట్లో పెద్దలకు చెప్పకుండా రైలు ఎక్కేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయవాడ అజిత్ నగర్‌కు చెందిన ఇద్దరు సోదరులు, గుంటూరు నల్లచెరువు ప్రాంతానికి చెందిన మరో బాలుడు ప్రతి ఆదివారం గుణదల మేరీ మాత ఆలయం వద్ద కలుసుకునేవారు. ఈ ఆదివారం కూడా అక్కడ కలుసుకున్న ముగ్గురూ.... టీవీ, సినిమాల్లో చూసిన దుబాయ్ వెళ్లాలనుకున్నారు. పెద్దలకు చెప్పకుండా విజయవాడ రైల్వేస్టేషన్లో ఆదివారం మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. బాపట్లకు చెందిన ఒక ప్రయాణికుడు వీరిని గమనించి అనుమానంతో ప్రశ్నించగా దుబాయ్ వెళ్తున్నట్లు చెప్పారు. వెంటనే అతను బాపట్ల పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. రైల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఫీఎఫ్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో రైలు బాపట్ల రైల్వే స్టేషన్లో ఆగగానే పిల్లల్ని ఆర్పీఎఫ్ సిబ్బంది కిందకు దింపారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. బాలురతో మాట్లాడి సమాచారం నమోదు చేసిన పోలీసులు... తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారి తల్లిదండ్రులు స్పందించని పక్షంలో బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పట్టణ సీఐ అశోక్ అశోక్ కుమార్ తెలియజేశారు.
ఇదీ చదవండి: కేరళ చిన్నారికి కరోనా- 42కు చేరిన బాధితులు
దుబాయ్‌కు వెళ్దామని రైలెక్కిన బుడతలు! - దుబాయ్‌కు వెళ్లేందుకు పిల్లలు ప్రయత్నం
చిన్నపిల్లలపై సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఉదాహరణ ఈ ఘటన. సినిమాల్లో దుబాయ్‌ను చూసిన ముగ్గురు పిల్లలు అక్కడికి వెళ్లాలని భావించి రైలులో బయలుదేరారు. ఓ ప్రయాణికుడు వీరిని గమనించి సమాచారం అందించటంతో ఆ పిల్లలను పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు.