గుంటూరు జిల్లాలో అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు...మేడికొండూరు మండలం పేరేచర్ల కాలువ వద్దకు వచ్చింది. ఒక్క సారిగా అదుపు తప్పి కాలువలో పడిపోయి నీట మునిగింది. గమనించిన స్థానికులు కారు వెనుక అద్దాలు పగలకొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కొద్ధి సమయం ఉపిరి ఆడక ప్రయాణికులు ఇబందిపడ్డారు. కారులో స్త్రీనిధి జిల్లా అసిస్టెంటు జిల్లా మేనేజర్ చెన్న కేశవులు, కారు డ్రైవరు చిరంజీవి ఉన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చదవండి: