గుంటూరు జిల్లా కాశిపాడుకు చెందిన పులిపాటి రాధాకృష్ణ మూర్తి, వెంకట నరసమ్మ దంపతులు.. స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్నారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు కాజేయలన్న ఉద్దేశ్యంతో ఇంటికి సమీపంలో ఉంటున్న మల్లెల గోపి అనే యువకుడు అర్ధరాత్రి కత్తులతో రాధాకృష్ణ ఇంటిలోకి ప్రవేశించాడు. ప్రతిఘటించిన రాధాకృష్ణ ను తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. అడుకున్న భార్య వెంకట నరసమ్మపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
రాధాకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దంపతుల ఒంటిపై ఉన్న 150 తులాల బంగారు ఆభరణాలు, అక్కడి నగదు చోరీ చేసి హంతకులు పరారయ్యాదు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట నర్ససమ్మను స్థానికులు గుర్తించి.. వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది, క్లూస్ టీంతో అక్కడకు చేరుకుని సంఘటన తీరును పరిశీలించారు. మల్లెల గోపిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: