సరదాగా ఈత కొడదామని మిత్రుడితో కలిసి క్వారీ గుంతలో దిగిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగింది. నగరంలోని గాంధీ బొమ్మల వీధికి చెందిన మిట్ట యశ్వంత్, కాళిదాసు కోటీశ్వరరావు ఇద్దరు మిత్రులు. పేరేచర్లలోని క్వారీ గుంతలో ఈత కోసం ఇద్దరూ దిగారు.
నీటి ప్రవాహానికి అదుపు తప్పిన యశ్వంత్(15) మునిగిపోయాడు. మేడికొండూరు పోలీసులు సమాచారం అందుకోగా.. ఎస్సై నరహరి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో క్వారీ గుంతలో గాలించారు. బాలుడి ఆచూకీ లభించకపోవడంపై కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: