ETV Bharat / state

లక్ష రుద్రాక్షలతో... ఏడడుగుల శివలింగం - లక్ష రుద్రాక్షల శివలింగం వార్తలు

కార్తీకమాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. దీని ప్రత్యేకతను చాటుతూ... పెదకాకాని ఆలయంలో లక్ష రుద్రాక్షలతో శివలింగాన్ని రూపొందించారు. ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

లక్ష రుద్రాక్షలతో చేసిన 7 అడుగులు శివలింగం
author img

By

Published : Oct 30, 2019, 6:21 PM IST

Updated : Oct 30, 2019, 6:33 PM IST

ఏడడుగుల శివలింగం

గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో... కార్తీకమాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం స్వామివారి కళ్యాణమండపంలో 7 అడుగుల రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ శివలింగాన్ని ఆవిష్కరించారు. లక్ష రుద్రాక్షలతో చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. కార్తీకమాసం చివరి రోజున రుద్రాక్షలన్నీ భక్తులకు అందజేస్తామని ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.

ఇదీచూడండి.గుంటూరు కలెక్టరేట్ ఎదుట నారా లోకేశ్‌ దీక్ష

ఏడడుగుల శివలింగం

గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో... కార్తీకమాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం స్వామివారి కళ్యాణమండపంలో 7 అడుగుల రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ శివలింగాన్ని ఆవిష్కరించారు. లక్ష రుద్రాక్షలతో చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. కార్తీకమాసం చివరి రోజున రుద్రాక్షలన్నీ భక్తులకు అందజేస్తామని ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.

ఇదీచూడండి.గుంటూరు కలెక్టరేట్ ఎదుట నారా లోకేశ్‌ దీక్ష

Intro:ఈశ్వరాచారి....గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్......కార్తీకమాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం , భక్తులు కార్తీకమాసం నెలరోజులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. శివుడు బోలా లింగేశ్వరడు... ఆయన ఏ రూపంలో ఉన్న భక్తులు ఆయన స్వరూపాన్ని చూసి మైమరిచిపోతారు. గుంటూరు లో అటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు. లక్ష రుద్రాక్షలుతో చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులను, చూపరులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

గుంటూరు జిల్లా పెదకాకని లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి కార్తీకమాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీకమాసం పురస్కరించుకుని భక్తుల యొక్క దర్శనార్థం ప్రత్యేకంగా స్వామి వారి కళ్యాణమండపం లో 7 అడుగుల రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున వేద పండితులు, మంత్రోచ్చరణ , విశేష పూజలు చేసి లక్ష రుద్రాక్షలుతో శివలింగాన్ని ఆవిష్కరించారు. లక్ష రుద్రాక్షలుతో చేసిన శివ లింగం భక్తులను ఆకట్టుకుంది. కార్తీకమాసం ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేక్ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ తెలిపారు. లక్ష రుద్రాక్షలుతో 7 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల రోజులు శివలింగానికి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు.

కార్తీకమాసం నెల రోజులు శివలింగాన్ని భక్తుల దర్శనార్ధం అందుబాటులో ఉంటుందని ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు. కార్తీకమాసం చివరిరోజున రుద్రాక్షలు ని భక్తులు అందచేస్తామని ఆయన తెలిపారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

లక్ష రుద్రాక్షలుతో చేసిన 7 అడుగులు శివలింగం చాలా బాగుందని, కార్తీకమాసం లో ఇలాంటి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని భక్తులు తెలిపారు.


Body:బైట్......వర ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు

బైట్......డి.సుబ్బారావు, ఆలయ ఈఓ

బైట్......భక్తులు.


Conclusion:
Last Updated : Oct 30, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.