గుంటూరులో చంద్రబాబు రోడ్ షో వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పాత గుంటూరులోని యాదవ బజార్లో చంద్రబాబు రోడ్ షో వెళ్లే మార్గంలో వైకాపా కార్యకర్తలు జెండాలతో ర్యాలీ చేపట్టారు. రోడ్ షో దారిలోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైకాపా మద్దతుదారులు జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయటంతో.. పరిస్థితి గమనించిన పోలీసులు అప్రమత్తమై.. వైకాపా కార్యకర్తలను అడ్డుకున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేయటంతో.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం జెండాలు ఊపుతూ.. పెద్దగా నినాదాలు చేయటంతో.. పోలీసులు ర్యాలీని త్వరగా అక్కడి నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి...