ప్రసూతి, స్త్రీల విభాగం, దంతవైద్యం, నొప్పి నివారణ, నేత్రవైద్యం, మానసికవైద్యం, జనరల్ మెడిసిన్, ఎముకలు కీళ్లు తదితర విభాగాల సమస్యలకు ఈ-పరామర్శ్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందించనున్నట్లు మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ డాక్టర్ టక్కర్ తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. రోగులు నేరుగా హాజరుకావాల్సిన అవసరంలేని ఓపీడీకి సంబంధించి ఈ సేవలు అందిస్తామని వెల్లడించారు.
చిన్న ఆరోగ్య సమస్యల కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తే కొవిడ్ మరింత విస్తరించే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ టక్కర్ పేర్కొన్నారు. ఎయిమ్స్ అందించే ఈ టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఆయా సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం.. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ కార్డుల వారికి అందని వైద్యం