ETV Bharat / state

స్వస్థలాలకు చేరుకున్న అమర జవాన్ల పార్థివదేహాలు

ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన తెలుగు వీర జవాన్లు రౌతు జగదీష్, మురళీకృష్ణ పార్థివదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. అనంతరం శాఖమూరి మురళీకృష్ణకు సీఆర్​పీఎఫ్​ అధికారులు, తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో మురళీకృష్ణ పార్థీవదేహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు.

స్వస్థలాలకు చేరుకున్న అమర జవాన్ల పార్థివదేహాలు
స్వస్థలాలకు చేరుకున్న అమర జవాన్ల పార్థివదేహాలు
author img

By

Published : Apr 6, 2021, 5:09 AM IST

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ వద్ద మావోయిస్టుల దాడిలో మృతిచెందిన వీర జవాన్లు రౌతు జగదీష్, మురళీకృష్ణ పార్థివదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. జగదీష్

భౌతికకాయాన్ని విజయనగరంలోని ఆయన నివాసానికి అధికారులు చేర్చారు. ఈ సందర్బంగా వీర జవానుకు అడుగడుగునా పోలీసులు, స్థానికులు ఘన నివాళులు అర్పించారు. జాతీయ జెండా పట్టుకొని అమర్ రహే జగదీష్ అంటూ పరిసర ప్రాంతాలు దద్దిరిల్లేలా నినదించారు. జగదీష్ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార లాంచనాలతో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలంగాణ పోలీసుల ఘన నివాళులు..

మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం వద్ద శాఖమూరి మురళీకృష్ణ భౌతికకాయానికి సీఆర్​పీఎఫ్ అధికారులు, తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. రాత్రి 11 గంటల 40 నిమిషాలకు మురళీకృష్ణ పార్థీవదేహం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోగా సీపీ సజ్జనార్ సహా సీఆర్పీఎఫ్‌ అధికారులు పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళి అర్పించారు. అనంతరం పార్థీవదేహాన్ని మురళీకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి తరలించారు.

అమర జవాన్లకు తెలంగాణ పోలీస్‌ శాఖ నుంచి జోహార్లు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా. అమర జవాన్లను స్ఫూర్తిగా తీసుకుని అందరం పనిచేయాలి. మురళీకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం .- సజ్జనార్, సైబరాబాద్ సీపీ.

ఇవీ చూడండి

: '400మంది నక్సల్స్​.. బుల్లెట్ల వర్షం కురిపించారు '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.