TEACHERS PROTEST: 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడాన్ని నిరసిస్తూ రెండో రోజూ ఉపాధ్యాయ సంఘాలు గుంటూరులో ఆందోళనకు దిగాయి. ఏపీటీఎఫ్, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తాలూకా సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. పదవీ విరమణ వయస్సు పెంపు అవసరం లేదని.. ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ తగినంత ఇస్తే చాలని ఉపాధ్యాయ నేతలు అన్నారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని నిరసిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పీఆర్సీని పునఃసమీక్షించాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: RGV TWEET: సినిమా టికెట్ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ