రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లికార్జునరావుకి మద్దతు తెలిపిన ఆయన.. బదిలీల ప్రక్రియ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో తీసుకువచ్చిందని చెప్పారు. అలాంటి జీవోను.. రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
సర్వీసు రూల్స్ సమస్య, ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక, సామాజిక సమస్యల పరిష్కారానికి మల్లికార్జునరావుకు మద్దతు ఇవ్వాలని సూచించారు. తనను కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. ఉపాధ్యాయయ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: