ETV Bharat / state

"ప్రభుత్వ నిబంధనల మేరకు పటిష్ట చర్యలు"

author img

By

Published : Nov 11, 2020, 5:04 PM IST

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పిల్లలు పాఠశాలలకు చేరుకోగానే థర్మల్ పరీక్షలతో పాటు చేతులకు శానిటైజ్ చేస్తున్నారు.

విద్యార్థులకు శానిటైజ్ చేస్తున్న ఉపాధ్యాయుడు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో విద్యార్థుల జాగ్రత్త కోసం ఉపాధ్యాయులు పటిష్ట చర్యలు చేపట్టారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకోగానే థర్మల్ పరీక్షలు చేస్తున్నారు. గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రధానోపాధ్యాయల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే పాఠశాలల ప్రారంభానికి ముందు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా రేపల్లె మండలంలో ముగ్గురు విద్యార్థులు, ఒక టీచర్, నిజాంపట్నం మండలంలో ఒక విద్యార్థి, ఇద్దరు ఉపాధ్యాయులు, నగరం మండలంలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు టీచర్ల​కు కరోనా సోకింది. బాధితులు అందరూ క్వారంటైన్ లో ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కాలేదని విద్యార్థుల జాగ్రత్త కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈవో హరిబాబు తెలిపారు.

ఇదీ చదవండి

డబ్బుపై ఆశతో క్రికెట్​ బెట్టింగ్​ వేశారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.