AP Police Files Case Against YCP MLC Duvvada Srinivas : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Police Case on Kodali Nani : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నానిపై నిన్న(నవంబర్ 17)న కేసు నమోదైన విషయం తెలిసిందే. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదు చేసింది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌ను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కొడాలి నానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణయ్య పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డిని విచారించాల్సిందే - హైకోర్టులో అప్పీలు చేసిన ఐసీఏఐ
పోసానిపై సీఐడీ కేసు : సినీ నటుడు పోసాని కృష్ణమురళీ పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 9న తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పోసానిపై 111,196,353,299,336(3)(4),341,61 (2) బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.సెప్టెంబర్ 28 వ తేదీన పోసాని కృష్ణమురళీ సీఎం చంద్రబాబును కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా ప్రసారమాథ్యమాల్లో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని పత్రికా సమావేశంలో పోసాని ఆరోపించినట్లు వంశీకృష్ణ ఫిర్యాదు లో పేర్కొన్నారు.
చంద్రబాబుపై పోసాని వ్యాఖ్యలు : సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దూషించారని సీఐడికి ఫిర్యాదు చేశారు. సీఎం హిందుత్వ వ్యతిరేకిలా చిత్రీకరించేలా పోసాని కృష్ణమురళీ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో తెలిపారు. పత్రికా సమావేశం కొన్ని ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమయ్యేలా ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోసాని వ్యవహరించారన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బదీశాయని వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. పత్రికా సమావేశంలో పెన్ డ్రైవ్ ద్వారా పోసాని కృష్ణ మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూపారని వాస్తవ చిత్రాలను జత చేస్తున్నామని వంశీకృష్ణ తెలిపారు. పోసానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ
ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదు - విభేదాల కేసులో ఫోన్ నంబర్లు ఇచ్చా: జైపాల్‌యాదవ్