TTD GOVERNING BODY KEY DECISIONS: తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ధర్మకర్తల మండలి నిర్ణయాలు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ బ్యాంకుల్లోకి టీటీడీ నగదు: డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్న టీటీడీ ఛైర్మన్, శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేస్తామని తెలిపారు.
శారదా పీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని తిరిగి తీసుకుంటామన్న బి.ఆర్.నాయుడు, పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం 2025 ఏడాది టీటీడీ క్యాలెండర్‌ను ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ఆవిష్కరించారు.
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు