రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. తాడేపల్లిలో అత్యాచారానికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె తెదేపా నేతలతో కలిసి పరామర్శించారు.రాష్ట్రంలో వరుసగా మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని విమర్శించారు.
మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందికి శిక్ష విధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని హోంమంత్రి, మహిళ కమిషన్ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలని తెదేపా గుంటూరు పార్లమెంటరీ మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో యువతిపై జరిగిన ఘటన అత్యంత బాధాకరమన్నారు.
ఇదీ చదవండీ.. Brahmamgari matam: పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు చర్చలు