ETV Bharat / state

టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు - మౌనం వహించిన ఎన్నికల సంఘం! - ఏపీలో ఓటరు జాబితాలో వైసీపీ అక్రమాలు

TDP Sympathizers Votes Removing in Guntur: ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఓట్ల అక్రమాలను వైఎస్సార్సీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్బడిముబ్బడిగా ఒకే ఇంటి నెంబర్‌పై వందల ఓట్లు చేర్పించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు విపక్షాల ఓట్లు ఇష్టానుసారం తొలగించేలా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు వైఎస్సార్సీపీకి వేస్తే ఉంచుతాం.. లేదంటే తొలగిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు పెద్దఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేసినా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది.

TDP_Sympathizers_Votes_Removing_in_Guntur

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 9:30 AM IST

టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు-మౌనం వహించిన ఎన్నికల సంఘం!

TDP Sympathizers Votes Removing in Guntur : ఓటర్ జాబితాల్లో అవకతవకలు, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫారం-7 (Form-7) దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది.

Irregularities in AP Voter List : వైఎస్సార్సీపీ ఓటర్లు మరణించినా జాబితాలో వారి పేర్లు కొనసాగిస్తున్న అధికారులు, తమ వారి ఓట్లను మాత్రం తొలగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించడానికి వైఎస్సార్సీపీ నేతలు వందలాది ఫారం-7 దరఖాస్తులు చేశారు. మూడు రోజుల్లోనే ఒక్కో పోలింగ్‌బూత్‌ పరిధిలో వందల దరఖాస్తులు వచ్చాయి. గంపగుత్తగా అయిదుగురు ఫారం-7 దరఖాస్తులు చేశారని, వారంతా వైఎస్సార్సీపీ నాయకులుగా గుర్తించామని తెలుగుదేశం నేతలు తెలిపారు.

Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!

Fake Votes in Andhra Pradesh : ఆధారాలు లేకుండా ఫారం-7 దరఖాస్తులు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చు లేదా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామన ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. బతికున్న వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.

Fake Votes in Machilipatnam: తప్పుల తడకగా బందరు ఓటర్ల జాబితా.. ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోని అధికారులు

Hundreds of Form-7 Applications : గుంటూరులో ఒక్కొక్కరూ వందలాది ఫారం -7 దరఖాస్తులు చేయడం విశేషం. కొండా శేషిరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 3న 167 దరఖాస్తులు చేయగా.. 4వ తేదీన 35, ఐదో తేదీన 33 చొప్పున మొత్తం 235 దరఖాస్తులు చేశారు. అలాగే చల్లా శేషిరెడ్డి 180, రాము 163, సిద్ధి వెంకాయమ్మ 173, పులుసు వెంకట్‌రెడ్డి 139 దరఖాస్తులు చేశారు. నవంబర్‌ 3 నుంచి 5 వరకు మొత్తం ఫారం-7 దరఖాస్తులు 1302 రాగా....అందులో 890 దరఖాస్తులను కేవలం ఈ ఐదుగురు వ్యక్తులే దాఖలు చేశారంటే ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో తెలుస్తోంది. వీరిలో చల్లా శేషిరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో కార్పొరేటర్‌గా పోటీ చేశారు.

YSRCP Irregularities in AP Voter List : ప్రస్తుతం డివిజన్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. సిద్ధి వెంకాయమ్మ కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తే ఆమెపై పట్టాభిపురం, అరండల్‌పేట పోలీసుస్టేషన్లలో భూవివాదాలకు సంబంధించిన కేసులున్నాయి. పులుసు వెంకటరెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. కొండా శేషిరెడ్డి, రాము ఇద్దరూ వైఎస్సార్సీపీకు చెందిన వారే. ఈ ఐదుగురు కూడా వైకాపా బూత్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.

Votes Deletion in AP: వైసీపీ సర్కార్ నయా ఆయుధం 'ఫారం-7'... ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.