గుంటూరులోని తెదేపా కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ సమీక్ష జరిగింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు. తమపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా దళిత ప్రతిఘటన సభ నిర్వహించన్నామని తెలిపారు. ఫిబ్రవరి 5న తిరుపతి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.
మరోవైపు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వారిపైనే తిరిగి దాడులు చేస్తోందని.. తెదేపా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. దళితులపైనే ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉపయోగిస్తుంటే.. హోం మంత్రి సుచరిత స్పందించకపోవడం దారుణమన్నారు. దళితుల్లో చైతన్యం తీసుకురావడానికే తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: