Telugu Desam Party Protest Against YCP sand Exploitation: వైసీపీ ఇసుక దోపిడీపై సత్యాగ్రహం చేపట్టిన తెలుగుదేశం పార్టీ.. రెండోరోజూ నిరసనలు కొనసాగించింది. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ధర్నాలు చేశారు. అక్రమ రవాణా అడ్డుకోవాలని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసి.. అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా... పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం దొంగరావిపాలెంలో, ఇసుక నిల్వ కేంద్రం వద్ద తెలుగుదేశం శ్రేణులు సత్యాగ్రహం నిర్వహించారు. అక్రమంగా తవ్విన ఇసుకను అనుమతుల్లేకుండా... ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా వాచ్పెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం శ్రేణులు ధర్నా చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు.
కృష్ణా జిల్లా ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్షకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో టీడీపీ శ్రేణులతో కలిసి ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తెలుగుదేశం హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే... వైసీపీ నేతలు దోచుకుంటున్నారని బొండా ఉమ ఆరోపించారు. కేవలం ఇసుకను దోపిడీ చేయడం ద్వారానే రూ. 40వేల కోట్లు దోచుకున్నారని బొండా ఉమ విమర్శించారు.
కర్నూలు జిల్లాలో గుడికంబాలి రీచ్ వద్ద తెలుగుదేశం ఆధ్వర్యంలో శ్రేణులు, కార్యకర్తలు ఇసుక సత్యాగ్రహం నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా అనిమల వద్ద.. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నారు. ఇసుక తరలించేందుకు అనుమతి పత్రాలు చూపాలని.. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి వారిని ప్రశ్నించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని అక్కడే ఆపారు. అక్కడి నుంచే ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చి ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్థరించారు.
అనంతపురం జిల్లా జిల్లాలో ఉన్న ఇసుక డంపింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు. పెద్దఎత్తున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాలీగా వెళ్లి, తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం శ్రేణులు ధర్నా చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇసుక దోపిడీలపై టీడీపీ చేపట్టిన మూడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తహసీల్దార్ కార్యాలయాల్లో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జిల్లా హిందూపురంలో నిరసన ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పరిగి మండలం సమీపంలోని ఇసుక డంపు వద్ద టీడీపీ నేత బి.కె. పార్థసారథి... వైసీపీ నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.