ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు మార్గ మధ్యలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద కాసేపు ఆగారు. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చిలకలూరిపేట కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నేతలు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, శిద్దా రాఘవరావు తదితరులు చంద్రబాబు వెంట ఉన్నారు.
చంద్రబాబు పర్యటన
నేడు ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటిస్తున్నారు. వైకాపా దాడుల్లో మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబాలను పరామర్శిచేందుకు చంద్రబాబు..జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని రుద్రమాంబపురం గ్రామంలో ఉంటున్న పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థికసాయం అందించనున్నారు. పర్చూరు పర్యటన తర్వాత చంద్రబాబు తిరిగి గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట, 3.30 గంటలకు సందర్శకులను కలుసుకుంటారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : నేరాలు - ఘోరాలు.. వైకాపా విధానాలు: చంద్రబాబు