ETV Bharat / state

TDP Political Action Committee Meeting at NTR Bhavan: తెలుగుదేశం నేతలతో రాజకీయ కార్యాచరణ భేటీ.. లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడి - Lokesh Padayatra

TDP Political Action Committee Meeting at NTR Bhavan: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను 29వ తేదీన మళ్లీ ప్రారంభించనున్నారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్లీ అక్కడ నుంచే మొదలుకానుంది. ఈ మేర టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశంలో తిర్మానించింది. జనసేనతో కలసి సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటుకు నేతలు నిర్ణయం తీసుకున్నారు.

tdp_political_action
tdp_political_action
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 8:17 AM IST

TDP Political Action Committee Meeting at NTR Bhavan: తెలుగుదేశం నేతలతో రాజకీయ కార్యాచరణ భేటీ.. లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడి

TDP Political Action Committee Meeting at NTR Bhavan: టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ ఈ నెల 9న అరెస్ట్‌ చేయడంతో లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా విరామమిచ్చారు. డాక్టర్​ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 8న రాత్రి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్​తో(Chandrababu arrest) పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు ఏర్పాటైన టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ తొలి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో జరిగింది. దిల్లీలో ఉన్న లోకేశ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్రను కొనసాగించడం వంటి పలు కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు ఆ పార్టీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు.

చంద్రబాబు ఆదేశాలతో 14 మంది సభ్యుల్ని కమిటీలోకి తీసుకున్నారు. కార్యక్రమాల్ని, నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీకి మద్దతుగా వచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో రాజకీయకక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును ఇరికించారని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో జరిగిన వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో విస్త్రతంగా ప్రచారం చేసేలా కార్యచరణ ప్రణాళికను రూపొందించనుంది.

TDP Leader Ayyanna Fire on Kodali Nani: కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన.. అయ్యన్నపాత్రుడు

Lokesh Yuvagalam Padayatra: లోకేశ్‌ పాదయాత్రకు ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకున్న విషయాన్ని సమావేశంలో నేతలు చర్చించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ప్రజల ఆదరణతో ఇప్పటి వరకు పాదయాత్ర దిగ్విజయంగా జరిగిందని, ఇకపైనా అలాగే కొనసాగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తు అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. విపక్ష నాయకులు, కార్యకర్తలపై ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలు, అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని బలంగా ప్రజల్లో ఎండగట్టేందుకు, కలసి పోరాడేందుకు త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీలో ఎంతమంది సభ్యులుండాలి? ఎవరుండాలి? అన్న విషయాన్ని రెండు పార్టీల ముఖ్యనేతలతో మాట్లాడి నిర్ణయిస్తారు.

NRI Agitations in Poland Against Chandrababu Arrest: పోలండ్, ఫ్రాన్స్​లో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగుల ఆందోళనలు

TDP Political Action Committee Meeting: జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో సమన్వయం ఎలా ఉండాలి? స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేయాలా? అనుబంధ కమిటీలు ఉండాలా? వంటి విషయాన్ని ఆ కమిటీ నిర్ణయిస్తుంది. జగన్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెడుతోందని,అవినీతి జరిగినట్టు చిన్న ఆధారం లేకపోయినా, లేని కేసుని సృష్టించి చంద్రబాబుని జైల్లో పెట్టారని నేతలు మండిపడ్డారు. సంబంధం లేని కేసులు రోజుకొకటి తీసుకొచ్చి తెలుగుదేశం నాయకుల్ని, పార్టీని ఇబ్బంది పెడుతున్న తీరును క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఏదైనా ఒక వస్తువు ఉంటే.. దాన్ని దొంగతనం చేశారనో, దోపిడీకి పాల్పడ్డారనో చెప్పినా అర్ధముంటుందన్న నేతలు అసలు రోడ్డే లేని, భూసేకరణ కూడా జరగని అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్‌ని నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో వేయడం ఈ ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్టగా దుయ్యబట్టారు.

Amaravati Ring Road case: ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్​పై.. వాదనలు రేపటికి వాయిదా...

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో(skill development case) ఆధారాల్లేకుండా చంద్రబాబుని అరెస్ట్‌ చేసి ఏమైనా ఆధారాలుంటే మీరే చెప్పాలని అడిగే పరిస్థితికి వచ్చారని నేతలు విమర్శించారు. ఇవన్నీ ప్రజలకు వివరించి ఈ ప్రభుత్వాన్ని, జగన్‌ను, వైసీపీను బంగాళాఖాతంలో కలిపేంత వరకు పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, వారంతా ఆ హడావుడిలో ఉంటే అధికార పార్టీ గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల జాబితాల్లో ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించడం, బూత్‌లు మార్చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతోందని నేతలు మండిపడ్డారు. ఓటర్ల జాబితాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీ సమావేశంలో తిర్మాంనించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.