తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో కొనసాగుతోంది. మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, రైతులకు పొలిట్ బ్యూరో నివాళులర్పించింది. 19 నెలలలో 16 మంది తెదేపా కార్యకర్తలను హత్య చేశారని నేతలు ఆరోపించారు. కార్యకర్తల మృతికి సంతాపం తెలుపుతూ.. 2 నిమిషాలు మౌనం పాటించారు.
పార్టీ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా సమావేశంలో... 13 అంశాలపై చర్చ చేపట్టారు. ఎమ్మెల్సీ, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికపై చర్చించారు. వ్యవస్థల విధ్వంసం-రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు-అన్నదాతలను ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యం అంశాలపై చర్చించేందుకు నిర్ణయించారు. అమరావతి భవిష్యత్ కార్యాచరణ, క్షీణించిన శాంతి భద్రతలు – ప్రజల ప్రాణాలకు కరువైన రక్షణ - బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై పెరిగిన దాడులు, దేవాలయాలపై వరుస దాడులు - ప్రభుత్వ వైఫల్యాలు, ఇళ్ల పట్టాల పంపిణీ - భూసేకరణలో అవినీతి, పోలవరం భూసేకరణ, ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటాలు సమీక్ష, సంస్థాగత నిర్మాణం పొలిటికన్సాలిడేషన్ తదితరుల అంశాలను ఇందులో చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: 'రైతులవి గొంతెమ్మ కోర్కెలు కాదు... న్యాయపరమైన డిమాండ్లు'