ETV Bharat / state

ఆత్మహత్య చేసుకున్న కార్మిక కుటుంబానికి లోకేశ్‌ ఆర్థికసాయం - nakka anada babu latestnews

ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న గుంటురు జిల్లాలోని అడప రవి కుటుంబాన్ని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు. ఆ కుటుంబానికి  పార్టీ తరుఫున లక్ష రూపాయిలు ఆర్థిక సాయం చేశారు. అక్రమ ఇసుక విధానానికి స్వస్తి పలికి ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న కార్మిక కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్
author img

By

Published : Nov 13, 2019, 7:53 PM IST

ఇసుక అక్రమ రవాణాపై నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన లక్ష రూపాయిల ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడి జరిగిందని అంటున్న ముఖ్యమంత్రి... తమ విధానంతో లారీ ఇసుక 70 వేల రూపాయలు చేశారని ఎద్దేవా చేశారు. ఇది వైకాపా ప్రభుత్వం అవినీతి పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు ఉండేదని.... లారీ ఇసుక రూ. 10 వేలకే దొరికేదని వివరించారు.

ఆయన వెంట వచ్చిన నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ఇసుక లేక, పనుల్లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న కార్మిక కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

ఇదీ చూడండి

కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా..!

Intro:Ap_gnt_13_51_tdp_jatiyakaryadarsi_naralokesh_paryatana_AP10117
ఇసుక కొరత కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యగా గుర్తించి వారికి 25 లక్షలు రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు పొన్నూరు పట్టణంలో మూడవ వార్డు కు చెందిన అడప రవి అనే భవన కార్మికుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులను
పరామర్శించేందుకు వచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున రూ లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు

Body:అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు bite 1 నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ట్రాక్టర్ ఇసుక రూ 4 వేల నుంచి 7000 ఉండేదని లారీ ఇసుక 10 వేలు మాత్రమే ఉండేదన్నారు ప్రస్తుతం లారీ ఇసుక 70 వేల రూపాయలు పలుకుతుంది అన్నారు మూడు నెలలుగా ఇసుక సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతుంటే వారికి చీమైనా కుట్టినట్లు లేకపోగా మాపై ఎదురుదాడికి దిగుతున్నారు ఇసుక లేక కార్మికులు అల్లాడుతుంటే ఆ శాఖ మంత్రి ఇప్పుడు ఇసుక రాదని కార్మికులకు తెలీదా అంటూ మరో మంత్రి e బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది పోలీసుల వైఫల్యం అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో మూడు నెలలు ఇసుక రావడానికి సమయం పడుతుందని ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వం దగ్గరే స్పష్టమైన సమాధానాలు రావడం లేదన్నారు దేశ చరిత్రలు ఇంతవరకు ఇసుక కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోయినట్లు ఎక్కడా లేదన్నారు ఐదు నెలల వ్యవధిలో రాష్ట్రంలో 42 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కుటుంబాలకు రూ రూ 25 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేసి ఇ భవన కార్మికులందరికీ నెలకు పది వేల వంతున ఐదు నెలల కాలానికి 50000 అందజేయాలని పాత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు

Conclusion:బైటే2
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు

బైట్ మూడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ కారణంగా 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.