ETV Bharat / state

ఇప్పటంలో ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ విగ్రహాలు తొలగింపు - ఇప్పటం

Ippatam: రహదారి విస్తరణ కోసమంటూ ప్రభుత్వం గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కూల్చివేసింది. కాని అదే రోడ్లు మార్గంలోనున్న 2 వైఎస్‌ఆర్‌ విగ్రహాలను తొలిగించకపోవడంతో.. వైకాపా ప్రభుత్వంపై ప్రజలు, నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలు తొలిగించారు.

Removal of YSR statue
వైఎస్‌ఆర్‌ విగ్రహాల తొలిగింపు
author img

By

Published : Nov 9, 2022, 5:24 PM IST

Ippatam: గుంటూరు జిల్లా ఇప్పటంలో రహదారి విస్తరణ కోసమంటూ ఇళ్లు కూల్చేసి.. వైఎస్‌ఆర్‌ విగ్రహం జోలికి వెళ్లని అధికారులు.. ఎట్టకేలకు దాన్ని తొలగించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు వైఎస్‌ఆర్‌ విగ్రహాల్లో.. పవన్‌ కల్యాణ్ పర్యటన తర్వాత అధికారులు ఒకటి తొలగించారు. ఈరోజు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆగమేఘాలపై రెండో విగ్రహాన్నీ తొలగించారు.

రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో 53 ఇళ్లు ధ్వంసం చేయడమేగాక.. జాతీయ నేతల విగ్రహాలనూ అధికారులు తొలగించారు. కానీ వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు మాత్రం ఇనుప కంచెలు వేసి భద్రత కల్పించారు. ఇదేం నీతి అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం మరో గత్యంతరం లేక తొలుత ఒక విగ్రహాన్ని తొలగించింది. ఇప్పుడు లోకేశ్‌ కూడా అదే అంశాన్ని నిలదీస్తాడేమోనన్న అనుమానంతో.. రెండో విగ్రహాన్నీ హడావుడిగా తొలగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.