TDP Nara Lokesh About Schools Situation in Andhra Pradesh: వైసీపీ సర్కారు పాపాలు పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని అన్నారు. ఈ మేరకు మహమ్మారిపై యుద్ధం చేద్దామని, ప్రజలారా కలిసి రావాలని పిలుపునిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాలో స్కూలుకి వెళ్లిన అమ్మాయిని వైసీపీ ముఠా గంజాయికి బానిసని చేశారని లోకేశ్ అన్నారు. గంజాయికి అడిక్ట్ అయిన బాలికపై లైంగిక దాడులకి పాల్పడ్డారని, తన కుమార్తెను రక్షించుకోలేక ఆ తల్లి అనుభవించిన నరకం తన కళ్ల ముందు ఇంకా కదలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిని డీ అడిక్షన్ సెంటర్‌కి పంపామని వెల్లడించారు. వైసీపీ పాలనలో బడిలోకి, గుడిలోకి గంజాయి వచ్చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారన్న లోకేశ్, నియంత్రించాల్సిన సర్కారే ప్రోత్సహిస్తోందని తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయన్నారు.
సీఎం జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే, ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారని పేర్కొన్నారు. జగన్ ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుడిని పట్టుకోలేదని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో మద్యం మత్తులో ఉన్మాది అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవని ధ్వజమెత్తారు. విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్ , మద్యం కారణంగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు చూసి ఆవేదనతో కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరానని, లేఖలు రాశానని తెలిపారు.
గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు: లోకేశ్
డ్రగ్స్‌ను కట్టడి చేయాల్సిన సర్కారు తనపై మాటల దాడి చేసి, టీడీపీ కార్యాలయంపై దాడులకు పాల్పడింది కానీ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనం కావడం చూసి ఆందోళనతో ప్రధానికి లేఖ రాశానని, కేంద్రానికి వినతులు పంపానని అన్నారు. గవర్నర్‌ని కలిసి వివరించినట్లు గుర్తు చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, మహమ్మారికి దూరంగా ఉండాలని 'గంజాయి వద్దు బ్రో' అంటూ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు.
గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకూ తాను పోరాడుతూనే ఉంటానని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైందని, చోడవరంలో ఏడవ తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం తాగుతుండగా, వీడియో తీసిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. జగన్ వల్ల బడి పాడుబడిందని, పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనానికి కారణమైన దండుపాళ్యం వైసీపీ సర్కారుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీలేని పోరాటం సాగిస్తున్నామని, టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, ప్రమాదకర మద్యంపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ప్రజలారా గంజాయి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దామని, మన పిల్లల్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
-
జగన్ వల్ల పాడు`బడి`..
— Lokesh Nara (@naralokesh) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- వైకాపా సర్కారు పాపాలు..స్కూలు పిల్లల పాలిట శాపాలు
- స్కూళ్లలో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు
- విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం
- ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం
``చిత్తూరు జిల్లాలో స్కూలుకి… pic.twitter.com/6J3F6hjGZR
">జగన్ వల్ల పాడు`బడి`..
— Lokesh Nara (@naralokesh) January 8, 2024
- వైకాపా సర్కారు పాపాలు..స్కూలు పిల్లల పాలిట శాపాలు
- స్కూళ్లలో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు
- విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం
- ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం
``చిత్తూరు జిల్లాలో స్కూలుకి… pic.twitter.com/6J3F6hjGZRజగన్ వల్ల పాడు`బడి`..
— Lokesh Nara (@naralokesh) January 8, 2024
- వైకాపా సర్కారు పాపాలు..స్కూలు పిల్లల పాలిట శాపాలు
- స్కూళ్లలో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు
- విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం
- ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం
``చిత్తూరు జిల్లాలో స్కూలుకి… pic.twitter.com/6J3F6hjGZR
డ్రగ్స్ అడ్డాగా మారిన రాష్ట్రం - మత్తుకు బానిసలు కాకుండా పిల్లల్ని కాపాడుకుందాం : లోకేశ్