ETV Bharat / state

అక్రమ కేసులు పెట్టేందుకే..144 సెక్షన్: కనకమేడల - ycp badhitulu

తెదేపా తలపెట్టిన 'చలో ఆత్మకూరు'పై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఆత్మకూరులో 144 సెక్షన్ విధించారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన 70 కుటుంబాలలో 14 కుటుంబాలను తిరిగి తీసుకువచ్చారు. పోలీసుల చర్యపై తెదేపా ఎంపీ కనకమేడల స్పందించారు. బాధితులను తిరిగి తీసుకొచ్చారంటే... దాడులు జరిగినట్లు ఒప్పకొన్నట్లేనని స్పష్టం చేశారు.

అక్రమ కేసుల పెట్టేందుకే..144 సెక్షన్ : కనకమేడల
author img

By

Published : Sep 9, 2019, 10:20 PM IST

అక్రమ కేసుల పెట్టేందుకే..144 సెక్షన్ : కనకమేడల

తెదేపా 'చలో ఆత్మకూరు'పై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు గ్రామాన్ని వదిలివెళ్లిన వారిపై పోలీసులు ఆరా తీశారు. గ్రామం నుంచి 70 కుటుంబాలు వదిలి వెళ్లినట్లు నిర్ధరించుకున్నారు. వారిలో 14 కుటుంబాలను పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. మిగిలిన వారినీ త్వరలోనే గ్రామానికి తీసుకొస్తామని చెప్పారు.

144 సెక్షన్​పై కనకమేడల ప్రశ్నలు

పోలీసుల చర్యపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. కొన్ని కుటుంబాలను ఆత్మకూరుకు తిరిగి తీసుకెళ్లామని పోలీసులే చెబుతున్నారన్న కనకమేడల... బాధితులు ఊరు వదిలేసి వెళ్లినట్లు పోలీసులు ఒప్పుకున్నారన్నారు. ఎవరి వల్ల ఊరు వదలారో తేల్చాలని.. అలాంటివారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించడం కోసమే ఆత్మకూరులో 144 సెక్షన్ పెట్టారని కనకమేడల ఆరోపించారు. బాధితులకు రక్షణ కల్పించి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం లోగా పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించకుంటే తెదేపా ఆ బాధ్యత తీసుకుంటుందన్నారు.

ఇదీ చదవండి:

'పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'

Intro:ap_tpt_52_09_wards_punarvibhajana_lo_avakatavakala_pai_dharna_avb_ap10105

వార్డుల పునర్విభజనలో అవకతవకలను అరికట్టాలని కోరుతూ పలమనేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాBody:చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వార్డుల పునర్విభజనలో అవకతవకలను అరికట్టాలని కోరుతూ సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, పలు వార్డుల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. వివిధ వార్డులకు చెందిన నాయకులు, ప్రజలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డితో వారు మాట్లాడుతూ వార్డుల పునర్విభజనలో భాగంగా ఇష్టారీతిన వార్డులను విభజిస్తున్నారని తెలిపారు. సరైన పద్దతిలో విభజన చేయకుంటే హైకోర్టుకు వెళ్తామని వారు ఈ సందర్భంగా కమిషనర్ కు తెలిపారు.

కమిషనర్ మాట్లాడుతూ మీ అభ్యంతరాలు మంగళవారం లోగా కార్యాలయంలో అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కుట్టి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

నోట్: సర్ ఈ వార్తను నేను పొరపాటున
ap_tpt_51_09_wards_punarvibhajana_lo_avakatavakala_pai_dharna_avb_ap10105 అని పంపాను. ఈ 51వ ఫైల్ నెంబర్ తో ఉదయాన్నే వేరే వార్త పంపాను. గమనించి ఈ వార్తను 52 ఫైల్ నెంబర్ కింద పరిశీలించాల్సిందిగా మనవి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.