మందడం దీక్షా శిబిరంలోని మహిళా రైతులకు తెదేపా నేతలు నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ, పంచుమర్తి అనురాధ సంఘీభావం ప్రకటించారు. హైకోర్టులో జరిగిన వాదనలను పంచుమర్తి అనురాధ రైతులకు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదన్న కోర్టు వ్యాఖ్యలతో... రైతుల్లో ఆనందం నెలకొంది. తమ పోరాటం ఫలించి అన్నీ సానుకూల ఫలితాలు వస్తున్నాయని మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'మండలి'పై శాసనసభలో చర్చ!