TDP will Complaint to Governor: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనను ఆ పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీపై జరిగిన దాడులకు గవర్నర్‌కు వివరించనున్నారు.
ప్రతిపక్ష పార్టీ సభలు, కార్యక్రమాలపై అధికార పార్టీ దాడి చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. రాళ్ల దాడి ఘటనలో ఎన్ఎస్జీ కమాండోకు గాయాల అంశాన్ని నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్ధ నగ్న నిరసనపై సైతం గవర్నర్ వద్ద నేతలు ప్రస్తావించనున్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేసేందుకు అధికార పార్టీ పోలీసులను వాడుకుంటుందని... గవర్నర్‌కు వివరించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను తెలుగుదేశం నేతల బృందం గవర్నర్‌కు అందజేయనుంది.
కేంద్ర హెం శాఖ కార్యదర్శికి హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు: చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పట్ల పోలీసులు 151 సీఆర్పీసీని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో తెలిపారు. వీఐపీ భద్రత కోసం ఉన్న పోలీసు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంఘ వ్యతిరేక వ్యక్తులతో పోలీసుల సానుభూతి వ్యవహారం పట్ల విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అజయ్‌కుమార్ భల్లాను గూడపాటి లక్ష్మీనారాయణ కోరారు.
టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్: తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో యర్రగొండపాలెం ఘటన, అక్కడ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో శనివారం నాడు చర్చించారు. ఇందులో భాగంగానే దాడి ఘటన దృశ్యాలను గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా టీడీపీ అధికారులు పంపించారు. యర్రగొండపాలెం ఘటన వివరాలను రాజ్ భవన్‌తో పాటు డీజీపీ కార్యాలయానికి సైతం పంపించారు. ఆ మెయిల్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీపై జరిగిన ఘటనలను అందులో ప్రస్తావించింది.
ఇవీ చదవండి: