ETV Bharat / state

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ నేతల ఆగ్రహం - TDP leaders react in ap

Police blocking Chandrababu's visit at Anaparthi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు స్పందించారు. ఫ్యాక్షనిస్టు, ఫాసిస్ట్ కలయికే జగన్ రెడ్డి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నామని పయ్యావుల వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ చంద్రబాబు సభలను అడ్డుకోవడం ప్రభుత్వ అరాచకత్వానికి అద్దం పడుతోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశాడు.

TDP leaders
టీడీపీ నేతలు
author img

By

Published : Feb 17, 2023, 8:32 PM IST

TDP leaders react to police blocking Chandrababu's: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు స్పందించారు. ఫ్యాక్షనిస్టు, ఫాసిస్ట్ కలయికే జగన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నియంతలు కాలగర్భంలో కలిసినట్టు జగన్ రెడ్డి కూడా చరిత్ర నుంచి తొలగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజాబలానికి భయపడి అడుగడుగునా చంద్రబాబు సభలను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద కాన్వాయ్ ను అడ్డుకుని పోలీసులు అడ్డంగా రోడ్డుపై కూర్చోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసత్వం ప్రదర్శిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

పయ్యావుల కేశవ్: పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవర్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ అండ్ కో హడలిపోతుందని ఎద్దేవా చేశారు.

అనపర్తిలో చంద్రబాబు ప్రసగించకుండా పోలీసులను ఉపయోగించి బహిరంగ సభను అడ్డుకునే ప్రయత్నం చేసారని కేశవ్ విమర్శించారు. అనపర్తి సభకు జిల్లా పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా అకారణంగా సభకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. సంక్షేమ పథకాల పేరిట 10 రూపాయలు పంచిపెట్టి 100 కోట్టేస్తున్న జగన్ రెడ్డి అసలు మోసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. దోపిడీ చేయడం తప్ప జగన్ ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్​కే దక్కుతుందన్నారు.

యనమల రామకృష్టుడు: ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ చంద్రబాబు సభలను అడ్డుకోవడం ప్రభుత్వ అరాచకత్వానికి, నిరంకుశత్వానికి అద్దం పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్టుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టడం జగన్ రెడ్డి ఫ్యూడల్ మనసత్వానికి నిదర్శనమన్నారు. పోలీసులతో తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవాలనుకోవడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.