ETV Bharat / state

ఎస్సీలపై దాడులు నిరసిస్తూ తెదేపా నేతల నిరసన - చిలకలూరిపేటలో తెదేపా నేతల నిరసన

రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. బలహీన వర్గాలను దూషిస్తూ మాట్లాడారని మంత్రి పెద్దిరెడ్డిపై అర్బన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

tdp leaders protest in chilakaluripet guntur district
తెదేపా నేతల నిరసన
author img

By

Published : Jul 23, 2020, 7:45 PM IST

రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రి పెద్దిరెడ్డి అణగారిన వర్గాలను దూషించారని.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అర్బన్​ పోలీస్​ స్టేషన్​లో మంత్రిపై ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఎస్సీలపై అత్యాచారాలు, భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అంబేడ్కర్ రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

'రాష్ట్రంలో బలహీనవర్గాలపై దాడులు పెరిగాయి..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.