TDP leaders sensational comments on CM Jagan and YCP ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలకు పాల్పడుతూ.. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ జగన్ లాంటి వ్యక్తి సీఎంగా అవసరమా..? అంటూ సీఎం జగన్ నేర చరిత్రపై సుదీర్ఘంగా మట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులైనా.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జగనాసుర చరిత్రపై టీడీపీ ఫైర్.. నేరాలు, దోపిడీలతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ లాంటి వ్యక్తి సీఎంగా అవసరమా అనే విషయం ప్రజలు అలోచించుకోవాలని కోరారు. తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీసినా నేరచరిత్ర సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను పొగడడానికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప మరేం లేదని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లల్లో పేదలకు కలిగిన లాభం గోరంత.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు లాభం కొండంత అని ఆక్షేపించారు. జగన్‌ను ఇలా వదిలేస్తే ఇంటింటికి మద్యం కుళాయి పెట్టేస్తారని ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పుడు సింగిలే.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ''జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వ నాశనమైంది. మొత్తం క్రైమ్, కరప్షన్స్.. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్.. దరిద్రంగా తయారైంది. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి.. అలాంటి వ్యక్తి 30 ఏళ్లు పాలిస్తాడట. ఈరోజు జగన్‌ను.. ఆయన తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, మరో చిన్నాన్న చెల్లి వదిలేసింది. మరికొన్ని రోజుల్లో తమ్ముడు జైలుకు వెళ్లబోతున్నాడు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా సింగిల్‌గా రండి అంటాడు.. ఇప్పుడు ఆయనే సింగిలైపోయాడు. తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తే.. ఐదారు సీక్వెల్స్ తీయాల్సి వస్తుంది'' అని ఆయన అన్నారు.
చేతికి మట్టి అంటకుండా నేరం చేయిస్తాడు.. జగన్‌ను పొగడడానికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప మరేం లేదని.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లల్లో పేదలకు కలిగిన లాభం గోరంత.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు లాభం కొండంత అని ఆయన ఆక్షేపించారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్ పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకా హత్యేనని తెలిపారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివేకా క్యారెక్టరుపై దిగజారి విమర్శలు చేశారన్నా రు.
జగన్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్లాయి.. వివేకా హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డికి ఈ మెయిల్ ద్వారా నోటీసులు వెళ్లాయని.. మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. మెయిల్ వచ్చిందని తెలిసే దానిని చూడట్లేదన్నారు. జగనాసురుడు పది తలల రావణుడన్న దేవినేని ఉమా.. దరిద్రపాదం అడుగుపెట్టిన దగ్గర్నుంచి వ్యవసాయం క్లోజ్ అయిందన్నారు. ఆర్థిక నేరగాడిని శిక్షించకుంటే సమాజానికి నష్టమని అన్నారు. కేసీఆర్ నుంచి వేయి కోట్లు తెచ్చుకుని.. కృష్ణా నదిలో సగం వాటాను తాకట్టు పెట్టారని ఉమా ఆరోపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌నే విమర్శించారంటే వాళ్ల పరిస్థితేంటో అర్ధమవుతోందన్నారు. సీఎం జగన్ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి