ETV Bharat / state

TDP Leaders Fire on CM Jagan: కక్ష సాధింపులో జగన్​ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్: లోకేశ్ - మద్యం అమ్మకాల కేసులో చంద్రబాబు

TDP Leaders Fire on CM Jagan: చంద్రబాబుపై పీసీ యాక్ట్‌ కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్.. చంద్రబాబుపై కేసు పెట్టడం వింతగా ఉందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులో జగన్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

case-against-chandrababu-under
case-against-chandrababu-under
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 10:30 PM IST

Updated : Oct 31, 2023, 6:51 AM IST

TDP Leaders Fire on CM Jagan: కక్షసాధింపు రాజకీయాలల్లో భాగంగా ఇప్పటికే... పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారనే ఆరోపణల మీద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు పీసీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు... సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ కాపీ సమర్పించారు. ఇదే అంశంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

  • కక్ష సాధింపు కి మానవ రూపం జగన్. పిచ్చి కి లండన్ మందులు వాడుతున్నట్టే.. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిది. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన… pic.twitter.com/ZQ9PWxQEhl

    — Lokesh Nara (@naralokesh) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Case on Chandrababu Naidu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

Nara Lokesh Fire on CM Jagan: కక్ష సాధింపుకి మానవ రూపం జగన్ అని నారా లోకేశ్ మండిపడ్డారు. పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే.. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదని ఎద్దేవా చేశారు. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారని లోకేశ్ పేర్కొన్నారు. మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబుపై కేసు పెట్టడం వింతగా ఉందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చన్నారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకునేందుకు రాష్ట్రంలో జగన్‌ పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా తాను చర్చకు సిద్ధమని.. జే బ్రాండ్ సవాల్‌ విసురుతున్నట్లు లోకేశ్ తెలిపారు. జగన్‌ ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే సమయం చెప్పాలన్నారు. కక్ష సాధింపులో జగన్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

Prathidhwani: మద్యం మంటలు... అసలేం జరుగుతోంది?

ప్రజల దృష్టి మళ్లించడానికి: గత టీడీపీ హయాంలో మద్యంలో అక్రమాలు జరిగితే నాలుగున్నరేళ్ల పాటు ఎందుకు జగన్ రెడ్డి మౌనంగా ఉన్నారని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్​పై తీర్పు వచ్చే ముందు రోజే కనపడిందా అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబుపై మద్యం పేరుతో మరో అక్రమ కేసు పెట్టారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో, అరాచకంతో వ్యహరిస్తున్న జగన్ రెడ్డి రానున్న కాలంలో శిక్షకు గురికాక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Anam Ramanarayana Reddy on Liquor Scam: మద్యం కుంభకోణంపై విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి : ఆనం

Last Updated : Oct 31, 2023, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.