మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తెనాలి మార్కెట్ కూడలి నుంచి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమించారని బైక్ ర్యాలీ, మానవహారంలో పాల్గొన్న తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు.
ఇదీ చూడండి..