Vivekananda Reddy murder case: వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్యకు గురికాగా... అప్పుడు టీడీపీ నేతల పనే అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. బహిరంగాంగానే ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా సీబీఐతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. విచారణ ప్రారంభించిన సీబీఐ వైసీపీ నేతలకు చాప కింద నీరులా వైసీపీ నేతలవరకు రావడంతో విచారణ సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై టీడీపీ నేతలు న్నాయుడు, వర్ల రామయ్య స్పందించారు. తమను అరెస్టు చేయకుండా ఆపాలని అవినాశ్ రెడ్డి కోర్టులో ఫిటిషన్ వేసిన నేపథ్యంలో.. 13వ తేది వరకు అరెస్ట్ చేయకుడదు అని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అరెస్టులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా... టీడీపీ నేతల ఆరోపణలు ప్రధాన్యతను సంతరించున్నాయి.
అచ్చెన్నాయుడు: వివేకానందరెడ్డిని అసలు చంపిందెవరో ఏపీ మొత్తం తెలుసంటూ.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. అబ్బాయే, బాబాయ్‌ని చంపాడంటూ ఆయన ట్వీట్ చేశారు. వివేకా హత్యపై వైసీపీ వేరు వేరు సందర్భాల్లో పెట్టిన రెండు ట్విట్లను అచ్చెన్న తన ట్విట్టర్ కు జత చేశారు. వివేకా హత్య వెనుక చంద్రబాబు మాస్టర్ స్కెచ్ అంటూ నాడు వైసీపీ ట్విట్ చేసింది. నరహంతకుడు చంద్రబాబు అంటూ అందులో పేర్కొంది. ఆస్తుల పంపకాల్లో వివాదాల కారణంగానే వివేకా హత్య అంటూ తాజాగా వైసీపీ మరో ట్విట్ చేసింది. రెండో భార్య వారసులతో వివాదం వల్లే వివేకా బలయ్యారంటూ అందులో పేర్కొంది. ఆస్తుల పంపకాల అంశంలోనే వివేకా ప్రాణాలు కోల్పాయారని వైసీపీ వెల్లడించింది. రెండు ట్విట్లను తన ట్విట్టర్ కు జత చేసిన అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు నీచులందు వైసీపీ నీచులు వేరంటూ దుయ్యబట్టారు. రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే నీచులని ఆక్షేపించారు. నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
పురుషులందు పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు నీచులందు వైసీపీ నీచులు వేరయా! రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే నీచులు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు వీళ్ళు.. #JaganPaniAyipoyindhi #AbbaiKilledBabai #PsychoPovaliCycleRavali #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/f7IQTyXJNk
— Kinjarapu Atchannaidu (@katchannaidu) March 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">పురుషులందు పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు నీచులందు వైసీపీ నీచులు వేరయా! రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే నీచులు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు వీళ్ళు.. #JaganPaniAyipoyindhi #AbbaiKilledBabai #PsychoPovaliCycleRavali #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/f7IQTyXJNk
— Kinjarapu Atchannaidu (@katchannaidu) March 11, 2023పురుషులందు పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు నీచులందు వైసీపీ నీచులు వేరయా! రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే నీచులు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు వీళ్ళు.. #JaganPaniAyipoyindhi #AbbaiKilledBabai #PsychoPovaliCycleRavali #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/f7IQTyXJNk
— Kinjarapu Atchannaidu (@katchannaidu) March 11, 2023
వర్ల రామయ్య: హూ కిల్డ్ బాబాయ్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి సీబీఐ విచారిస్తేనే కేసువిచారణ సంపూర్ణమైనట్టని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఎన్నికుప్పిగంతులు వేసినా, ఎన్నిఅబద్ధాలు, అసత్యాలు వల్లెవేసినా వివేకాహత్య చేసిందెవరో రాష్ట్రప్రజలకు అర్థమైందని తెలిపారు. వివేకా హత్య జరిగింది మొదలు నేటివరకు అనేకప్రశ్నల తాలూకా వేళ్లు ముఖ్యమంత్రి వైపుచూపిస్తున్నా, వాటికి ఆయన ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. వివేకా హత్యతో అవినాశ్ రెడ్డి సంబంధం విడదీయరానిదని వర్ల తెలిపారు.
ఇవీ చదవండి: