ETV Bharat / state

వైసీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి ముదిరింది..: టీడీపీ నేత సోమిరెడ్డి

author img

By

Published : Feb 28, 2023, 3:28 PM IST

Somireddy Comments on Rythu Bharosa: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి ముదిరిపోయిందని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు కేంద్రం ఇచ్చే సాయానికి కూడా జగన్మోహన్ రెడ్డి తన పేరు చెప్పుకుని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చేది 90 కోట్లు మాత్రమేనని తెలిపారు.

Somireddy Comments
సోమిరెడ్డి

Somireddy Comments on Rythu Bharosa: బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతుల గొంతు నొక్కుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు కేంద్రం ఇచ్చే సాయానికి కూడా జగన్మోహన్ రెడ్డి తన పేరు చెప్పుకుని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చేది రూ.90 కోట్లు మాత్రమేనని దుయ్యబట్టారు. రూ.90కోట్ల సాయానికి వందల కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్న సీఎంకు ప్రచార పిచ్చి ముదిరిపోయిందని విమర్శించారు.

చేయని పనులు కూడా చేశామని చెప్పుకుంటున్న ప్రచార పిచ్చేంటో అర్థం కావట్లేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వం - మన ప్రభుత్వం అంటూ అసత్యాలతో కూడిన ప్రకటనలకు ప్రజల డబ్బు వెచ్చించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.10 లక్షల కోట్లు అప్పు చేసినా.. రైతులకు, రైసు మిల్లర్లకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది రూ1.75లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయన్న సోమిరెడ్డి,.. రేపు అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నీ చెల్లించాల్సింది కూడా తామేనని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రభుత్వం ఖర్చు చేసేది మూడొంతులు మాత్రమేనని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరిపోయింది : సోమిరెడ్డి

"వైసీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి ముదిరిపోయింది. రైతు భరోసా - ఇన్​పుట్ సబ్సీడీ పేరుతో ఒక పెద్ద ఎడ్వర్టైజ్​మెంట్ ఫుల్ షీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కింద ఆయన చెప్పారు.. జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ రైతన్నలకు అందించిన సాయం అక్షరాలా లక్షా 45 వేల 751 కోట్లు. ఆయన ఎకౌంట్లలో వేస్తున్న డబ్బులు.. మూడో విడతలో భాగంగా.. ఒక్కొక్కరికీ రెండు వేల చొప్పున.. 51 లక్ష 12 వేల మంది. 1090.76 కోట్లు వేస్తామని అన్నారు. దీంట్లో ఆల్రెడీ ప్రధాన మంత్రి గారు.. 1000 కోట్లు విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి మిగిలిన 90 కోట్లు మాత్రమే ఇచ్చారు. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. పత్రికా ప్రకటనలకు ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిలు ఎంత ఉన్నాయో చెప్తూ.. వాటిని మేము కడుతున్నాం అని ప్రతి ప్రకటనలో చెప్తున్నారు. బటన్ నొక్కిన ప్రతి సారీ చెప్తున్నారు. మీరు రైసు మిల్లర్లకు, కాంట్రాక్టర్లకు, వివిధ సంస్థలకు, రైతులకు.. లక్షా 70 వేల కోట్లు మీరు అప్పు పెట్టారు. రేపు మా ప్రభుత్వం అధికారంలోని వస్తుంది. మీరు చేసిన లక్షా 70 వేల కోట్ల రూపాయలు మేమే కదా కట్టాలి. దానికి మేము కూడా అప్పుడు.. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు మేము కడుతున్నాం అని అయిదు సంవత్సరాలూ పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవాలా? అన్నదాత సుఖీభవ పేరుతో మేము రైతులకు 15 వేల రూపాయలు ఇవ్వాలనుకున్నాం. కానీ ఈ లోపే ఎన్నికల కోడ్ వచ్చింది. కానీ మీరు ప్రస్తుతం 13,500 రూపాయలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు". - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.